నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమాలో ముద్దుగుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ బాలకృష్ణ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో బాలకృష్ణ ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా ఈ సినిమాలో రైతుగా, అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో లను కూడా ఇప్పటికే చిత్రబృందం ఇప్పటికే విడుదల చేయగా ఈ ప్రోమో లకు జనాల నుంచి అనూహ్య స్పందన లభించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలను కూడా మరింతగా పెంచింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై జనాల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి ప్రధాన కారణం ఇదివరకే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ , లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను సాధించడం మాత్రమే కాకుండా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న అఖండ సినిమా ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హైడ్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు, కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాను చక చక పూర్తి చేసి దసరా సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అనేక వార్తలు బయటకు వచ్చాయి, కాకపోతే సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో దసరా బరిలో ఈ చిత్రాన్ని ఉంచడం లేదు అని కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను పెద్దగా పోటీ లేని దీపావళి బరిలో ఉంచాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నందమూరి నటసింహం బాలకృష్ణ పెద్దగా పోటీ లేని దీపావళి బరిలో దిగుతాడా..?లేక వేరే ఏదైనా తేదీలలో థియేటర్ లోకి రావడానికి ప్రయత్నిస్తాడా..?తెలియాలంటే సినిమా విడుదల తేది ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.