ప్రకాష్ రాజ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బిపి మాత్ర ఇస్తే బాగుంటుందని.. అపరిచితుడు గా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు విష్ణు. చిన్న చిన్న విషయాల కు మా పరువు తీస్తున్నాడని.. రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారని నిప్పులు చెరిగారు మంచు విష్ణు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని ఎలక్షన్ కమిషన్ కి చెప్పన అని.. మా ప్యానెల్ సభ్యులు కూడా పేపర్ బ్యాలెట్ కి వెళదాము అని చెప్పారని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ 60 సంవత్సరాలు పై బడిన వారికి పోస్టల్ ఓట్ వుందని.. 180 నుంచి 190 మంది దాకా 60 సంవత్సరాలు దాటిన వారు వున్నారని పేర్కొన్నారు మంచు విష్ణు.
వాళ్లకు నేను కాల్ చేసి మాట్లాడాను వాళ్ళల్లో కొందరు వస్తాము ఓటు వేస్తాము కొందరు పోస్టల్ బ్యాలెట్ అని అన్నారన్నారు. ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలి అంటే 500 రూపాయలు కట్ట మన్నారని.. తెలిపారు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడని.. కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా??? అని ఫైర్ అయ్యారు మంచు విష్ణు. తమిళ్ కన్నడ మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినదిగినా చెపుతారని.. ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు విష్ణు.
ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వే లో వున్నాను.. ఇక్కడ మా ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఫైర్ అయ్యారు మంచు విష్ణు. సినిమా తీసేటప్పుడు ఫ్లాప్ అవుతది అని ఎవ్వరూ చెయ్యరు.. జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పాలన్నారు. ఉమ్మడి కుటుంబం లో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకు రావద్దని.. తన గురించి మాట్లాడండి కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడ వద్దని హెచ్చరించారు మంచు విష్ణు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు. తనకు తన తండ్రి మోహన్ బాబు సపోర్ట్ వుందని పేర్కొన్నారు మంచు విష్ణు.