కుర్ర భామలకు పోటీ ఇచ్చేలా తయారవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ యంగ్ బ్యూటీస్ కు సవాల్ విసురుతున్నారు. ఐదు పదుల వయసు దాటినా తమలో ఇంకా ఆ జోరు తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఇంకేముందీ ఇది చూసిన యంగ హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు.
ఇంద్రజ పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యలేదు గానీ, ఇప్పుడు టీవీషోస్తో ఫుల్ బిజీగా ఉంది. అనుష్క లాంటి హీరోయిన్లు పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఫారెన్ ఫార్ములాస్ కూడా ఫాలో అవుతోంటే, ఇంద్రజ మాత్రం ఫార్టీస్లోనూ నాటి లుక్‌నే మెయింటైన్ చేస్తోంది. ఇప్పటికీ 'యమలీల' జీన్‌ప్యాంట్ బుల్లెమ్మలాగానే సందడి చేస్తోంది.
సొనాలి బింద్రే స్క్రిప్ట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో, లుక్ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది. అందుకే క్యాన్సర్ నుంచి కోలుకున్నాక, మళ్లీ ఫిట్‌నెస్‌పై కాన్సన్ట్రేట్ చేసింది. జుట్టు లేకుండా ఉన్న ఫోటోస్‌ని ఎంత ధైర్యంగా అభిమానులతో పంచుకుందో, అంతే స్పీడ్‌గా మునుపటి లుక్‌తో జనాలముందుకు వచ్చింది. క్యాన్సర్ సర్వైవర్‌గా 46 ఏళ్ల వయసులోనూ అదే గ్లామర్‌ని మెయింటైన్ చేస్తోంది.
హిందీలో ఈమధ్య వార్తల్లో బాగా వినిపించిన పేరు శిల్పాశెట్టి. భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుతో కొన్నాళ్లు కెమెరాలకు కూడా దూరంగా ఉంది. అయితే ఇప్పుడు కేసులతో జనాల్లో వినిపించింది గానీ, అంతకుముందు యోగాక్వీన్గా, ఏజ్‌లెస్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అందుకే మిమి సినిమాలో కూడా శిల్పాశెట్టి కటౌట్ గురించి డైలాగ్స్ పెట్టారు మేకర్స్.
కుర్ర భామలకు పోటీ ఇచ్చేలా తయారవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ యంగ్ బ్యూటీస్ కు సవాల్ విసురుతున్నారు. ఐదు పదుల వయసు దాటినా తమలో ఇంకా ఆ జోరు తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఇంకేముందీ ఇది చూసిన యంగ హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయన్లు.. కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు.