మా పోరు : మోనార్క్ ఎవ‌రు? ముఠా మేస్త్రీ ఎవ‌రు?

RATNA KISHORE
చిత్ర‌సీమ హోరాహోరీగా సాగుతున్న పోటీకి సంబంధించి, మా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించి  ఎవ‌రో ఒక‌రు మాట్లాడుతూనే ఉన్నారు. స్థాయికి మించి మాట్లాడ‌డంలోనే అస‌లు త‌గ‌దా ఒక‌టి దాగి ఉంది. ఇదే స‌మ‌యంలో అటు విష్ణు, ఇటు ప్ర‌కాశ్ రాజ్ ఇద్ద‌రూ నువ్వా నేనా అని త‌ల‌ప‌డుతూ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో జ‌రిగిన వివాదాల‌ను త‌వ్వి తీస్తూ కొత్త వినోదం ఒక‌టి ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఛానెళ్లు కూడా వీటికే ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో అటు మీడియా, ఇటు సోష‌ల్ మీడియా  కూడా ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. ప్ర‌కాశ్ రాజ్ త‌న ఓట‌మిని కానీ త‌న గెలుపును కానీ ఎవ్వ‌రు నిర్ణ‌యించినా స్వీక‌రిస్తాను అని కూడా అంటున్నారు. తాను తార‌క్ తో మాట్లాడ‌తానని, వ‌చ్చి ఓటేయ‌మ‌నే చెబుతాన‌ని, ఆయ‌న ఓటు ఆయ‌న ఇష్టం క‌నుక వాటిపై నేను ఎటువంటి స‌ల‌హాలు ఇవ్వ‌న‌ని స్ప‌ష్టం చేశారు..ప్ర‌కాశ్ రాజ్..అనే విల‌క్ష‌ణ న‌టుడు. ద‌య‌చేసి తెలుగు భాష‌కు సంబంధించి లేదా జాతీయ అవార్డు తెచ్చిన సంద‌ర్భం గురించి తాను చెప్పిన మాట‌లు త‌ప్పుగా చూడొద్ద‌ని విన్న‌వించారు.

ఇక‌పై నేను మాట్లాడ‌ను. ఎన్నిక‌లు అయిపోయే వ‌ర‌కూ నేను మీడియా ముందుకు రాను అని చెబుతున్నారు ప్ర‌కాశ్ రాజ్. త‌న‌నెవ్వ‌రూ న‌డిపించ‌డం లేదు అని, ఇక్క‌డ ముఠాలు, ముఠా మేస్త్రీలు లేర‌ని, ఇందులో మ‌రో అభిప్రాయానికి తావేలేద‌ని చెబుతున్నారు ఆయ‌న‌. ఓ మీడియా ఛానెల్  నిర్వ‌హించిన ప్ర‌త్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. మా ఎన్నిక‌ల‌కు సంబంధించి చెప్పారు. ఆయ‌నేమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే...

 
నేను యాంటీ హిందూను అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది త‌ప్పు. నా న‌మ్మ‌కం నాది. నేను ఎవ్వ‌రినీ ఉద్దేశించి ఏమీ మాట్లాడ‌ను. ఏ మ‌తాన్నీ ఉద్దేశించి మాట్లాడిందీ లేదు. ఎప్పుడో రామ్ లీలా సినిమాకు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు  విష్ణు ప్ర‌స్తావించ‌డం త‌గ‌దు.


నేను ఎలా మాట్లాడుతున్నానో, నేనేం చెప్ప‌గ‌ల‌ను చేయ‌గ‌ల‌ను అన్న‌వి వివ‌రించ‌గ‌లుగుతున్నానో అదే విధంగా విష్ణు ప్యానెల్ కూడా మాట్లాడొచ్చు. త‌ప్పేం లేదు. అయితే ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. నేను నా పరిధి వ‌ర‌కూ బాగా ప‌నిచేసేందుకు ప్ర‌య‌త్నిస్తాను. నా హ‌యాంలో ఓ మంచి ప‌ని చేశాన‌న్న తృప్తి చాలు. నా వెనుక ఎవ్వ‌రూ లేరు. ఉండాల్సిన అవ‌స‌రం అవ‌త‌లి వారికి కూడా లేదు. నేను నా స్వ‌శ‌క్తితోనే గెలుస్తాను. ప‌వ‌న్ ను నాకు మ‌ధ్య విభేదాలు అభిప్రాయాల వ‌ర‌కూ మాత్ర‌మే! ద‌య‌చేసి ఇలాంటి వివాదాలు సృష్టించ‌వ‌ద్దు. నేను గెలిచాక ఏం చేయ‌గ‌లనో అన్న‌ది నా వ‌ర‌కూ తెలిస్తే చాలు. ఒక‌వేళ గెలిస్తే నా హ‌యాంలో మంచి చేశాన‌న్న తృప్తి నాకు మిగిలి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: