లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో టాప్ మూవీ ఇదే?
1990 వ సంవత్సరంలో మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం "కర్తవ్యం". ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఇందులో లీడ్ రోల్ లో నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు కథను రచయిత ద్వయం పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇది ఒక నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని కథను తయారు చేశారు. ప్రముఖ ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తీశారు. ఒక రాజకీయ యాక్షన్ చిత్రంగా వచ్చి ఎంతో మంది దర్శకులు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తీయడానికి ఒక దైర్యాన్ని ఇచ్చింది.
ఈ చిత్రంలో వైజయంతి ఐపిఎస్ గా నటించిన విజయశాంతి అదరగొట్టింది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో చరణ్ రాజ్ పాత్ర కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. రాజ్ కోటి మంచి నేపథ్య సంగీతాన్ని అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నిడివి మొత్తం రెండు గంటల 30 నిముషాలు. అయినా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసింది. ఈ సినిమా ఎ.ఎం రత్నం సూర్య మూవీస్ బేనర్ పై కేవలం 90 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా తన టోటల్ రన్ లో 7 కోట్ల రూపాయలను వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. విజయశాంతి ఈ సినిమాతో హీరోకు సమానమైన గుర్తింపు తెచ్చుకుంది.