వైష్ణవ్ తేజ్ కోరిక వెనుక పవన్ ప్రభావం !
అయితే అనుకోకుండా ‘ఉప్పెన’ మూవీలో అవకాసం రావడంతో పాటు ఆమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో తన ఆలోచనలు అన్నీ మారిపోయి హీరోగా సెటిల్ అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని వైష్ణవ్ తేజ్ అంటున్నాడు. తన అన్న సాయి ధరమ్ తేజ్ మొదటి నుంచి హీరో అవ్వాలని ప్రయత్నిస్తూ అనేక ఆడిషన్స్ కు వెళ్ళాడని తాను మాత్రం హీరోగా మారడానికి పెద్దగా ప్రయత్నించలేదనీ తనకు సినిమా అవకాశాలు అనుకోకుండా వచ్చాయి అని అంటున్నాడు.
ఈవారం విడుదల కాబోతున్న ‘కొండ పొలం’ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెపుతూ క్రిష్ ఈమూవీ కోసం చాల కష్టపడ్డాడు అని అంటున్నాడు. నిజానికి తన మేనమామలు టాప్ హీరోలు అయినప్పటికీ తాను ఎంపిక చేసుకునే సినిమా కథల విషయాలు ఎప్పుడు చిరంజేవి పవన్ లతో చర్చించనని తనకు ఎలాంటి కథలు నచ్చితే అలాంటి సినిమాలు చేయమని చెపుతూ ఉంటారని కామెంట్స్ చేసాడు.
ఇదే సందర్భంలో చిరంజీవి పవన్ ల మేనల్లుడుగా పుట్టడం తన గత జన్మల అదృష్టం అని చెపుతూ తన ‘కొండ పొలం’ మూవీకి ఎలాంటి ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ భయం లేదు అని అంటున్నాడు. ప్రస్తుతం ఈ మెగా యంగ్ హీరో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది..