జయప్రద సినీ జీవితంలో మైలురాయిగా మిగిలిన చిత్రం..!
జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అంతులేని కథ. కె. బాలచందర్ దర్శకత్వంలో 1976 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జయప్రద జీవితంలో బెస్ట్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. అంతేకాదు సినీ చరిత్రలోనే మంచి క్లాసికల్ ఫిలిం గా నిలిచిపోయింది. రజనీకాంత్ కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారనే చెప్పాలి.. ముఖ్యంగా ఒక మధ్య తరగతి అమ్మాయి తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరుకుంది అనే విషయాలను చాలా చక్కగా ఆవిష్కరించింది ఈ సినిమా.
అలాగే విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకులలో మంచి స్పందనను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాని 1974 వ సంవత్సరం లో తమిళంలో విడుదలైన అవల్ ఒరు తోడర్ కథైకి అని సినిమా నుంచి తెలుగులో అంతులేని కథ సినిమా ను రీమేక్ చేశారు.. అంతే కాదు, తమిళంలో కూడా ఈ సినిమాను కే బాలచందర్ దర్శకత్వం వహించడం గమనార్హం. తమిళంలో సుజాత పోషించిన పాత్రకు తెలుగులో జయప్రద నటించి , ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది.. ఇకపోతే ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే చిత్రీకరించడం గమనార్హం.