మహాసముద్రం పై అర్జున్ రెడ్డ్డి ప్రభావం !

Seetha Sailaja
గతనాలుగు సంవత్సరాలుగా శర్వానంద్ కు సరైన హిట్ లేదు. దీనితో అతడి కెరియర్ అయోమయంలో పడిపోయింది. అతడి సినిమాలు ఫెయిల్ అవుతూ ఉండటంతో అతడి మార్కెట్ కూడ పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో విజయ్ దశమి రోజున విడుదల కాబోతున్న ‘మహాసముద్రం’ మూవీ శర్వానంద్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది.


‘ఆరెక్స్ 100’ ఘన విజయం తరువాత దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ఆలోచించి తయారుచేసుకున్న కథ ‘మహాసముద్రం’ ఈ మూవీ కథను పుచ్చుకుని అజయ్ భూపతి ఎంతోమంది హీరోల చుట్టూ తిరిగినప్పటికీ వారెవ్వారిని మెప్పించాలేకపోయాడు. చివరకు తన కథకు శర్వానంద్ సిద్ధార్థ్ లను సెట్ చేసి ఈమూవీని పూర్తి చేసాడు.


రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ సెంటిమెంట్ ప్రభావితం చేస్తోంది. ఈ మూవీ నిడివి 153 నిముషాలు వచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ట్రెండ్ లో నేటితరం ప్రేక్షకులు సినిమా ఎంత బాగా ఉన్నప్పటికీ దాని నిడివి ఎక్కువగా ఉంటే చూడటంలేదు. ఈ ట్రెండ్ ను గ్రహించిన అజయ్ భూపతి ఈ మూవీ నిడివి తగ్గించాలి అని ప్రయత్నించినప్పటికీ ఈ మూవీ కథ రీత్యా అది కుదరలేదు అని అంటున్నారు.


గతంలో కలక్షన్స్ విషయంలో చరిత్ర క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ నిడివి సుమారు మూడు గంటలు ఉన్నప్పటికీ జనం చూశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మహాసముద్రం’ మూవీని కూడ నిడివి ఎక్కువైనప్పటికీ జనం చూస్తారు అన్న నమ్మకంతో నిడివి విషయంలో ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేస్తున్నట్లు టాక్. అయితే ఈసారి దసరా కు మీడియం రేంజ్ సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ‘పెళ్లిసందడి’ సినిమాలతో ‘మహాసముద్రం’ పోటీ పడుతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఇంత భారీ నిడివి ఉన్న సినిమాను ఎంతవరకు ప్రస్తుత తరం ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది దసరానాడు తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: