నందమూరి నాలుగవ తరం వారసుడు, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే బాలయ్య మాత్రం ఇప్పుడు వరకు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.మోక్షజ్ఞ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ వస్తున్నాడు.మరోవైపు మోక్షజ్ఞ కి అసలు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని,అతను వ్యాపార రంగం పైనే దృష్టి పెడుతున్నాడని..ఇలా అనేక కథనాలు వినిపించాయి.పైగా మోక్షజ్ఞ ఫిజిక్ కూడా మైంటైన్ చేయకపోవడం..అతని షేపౌట్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు..
అయితే అప్పటితో పోలిస్తే.. మోక్షజ్ఞ ఇప్పుడు కాస్త నయం అనే చెప్పాలి.ఇటీవల సెప్టెంబర్ 6 న మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో అభిమానులు అతన్ని కలవడానికి పిలుపునిచ్చాడు.ఇక వారిని కలిసి.. వారితో సన్నిహితంగా మాట్లాడి..తన ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.ఆ సమయంలో మోక్షజ్ఞ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో చాలా వరకు సన్న బడ్డాడు మోక్షజ్ఞ.దాంతో అభిమానులకు..తను ఫిజిక్ పై దృష్టి పెట్టినట్లు స్పష్టం అయ్యింది.దీంతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం చాలా దగ్గరలోనే ఉందని అంతా అనుకున్నారు.ఇక ఇదిలా ఉంటె..
తాజాగా 'అఖండ' సెట్ లో మోక్షజ్ఞ సందడి చేసాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇందులో బాలయ్య, మోక్షజ్ఞలతో పాటు అతని తల్లి వసుంధర దేవి కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు.అయితే ఈ ఫోటోని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ముఖ్యంగా ఈ ఫోటో లో మోక్షజ్ఞ చాలా స్లిమ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ఇక తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'అఖండ' సినిమాని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక దీపావళి కానుకగా నవంబర్ 4 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!