సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నరేష్..!

Divya
సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు కానీ హీరో కానీ వారు తొలిసారి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటే , ఇక ఆ సినిమా టైటిల్ ని తమ పేరు ముందు ఇంటి పేరుగా మార్చుకున్న వారు ఉంటారు. అలాంటివారిలో నిర్మాత దిల్ రాజు.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరో అల్లరి నరేష్.. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకు అల్లరి నరేష్ అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మంచి విజయాన్ని సాధించి ఈ సినిమా పేరు ని తన పేరు ముందు జోడించడం జరిగింది.


ఈ సినిమా కామెడీ చిత్రాలలో ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.. 2002వ సంవత్సరంలో ప్రముఖ నటుడు అలాగే దర్శకుడు అయినటువంటి రవిబాబు దర్శకత్వం వహించిన సినిమా అల్లరి. ఈ సినిమాలో హీరోగా నరేష్ హీరోయిన్గా శ్వేతా అగర్వాల్, నీలాంబరి లు కలిసి నటించారు.. ముఖ్యంగా చలపతిరావు, తనికెళ్ల భరణి మధ్య సాగే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా సాగాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి నరేష్ కు అల్లరి నరేష్ గా పేరు వచ్చేలా చేసింది ఈ సినిమా.


ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అల్లరి సినిమా తర్వాత దాదాపుగా కొన్ని కామెడీ చిత్రాలను  తెరకెక్కించి, కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. కానీ దాదాపు ఎనిమిది సంవత్సరాలు వరుసగా డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే నాంది సినిమా తో ఈ సంవత్సరం తెరపైకి వచ్చి  అఖండ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్  ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నాంది సినిమా తర్వాత ఈమె ఎంతో మంది హీరోలకు లక్కీ ఉమెన్గా కూడా మారిపోయింది. ఎప్పుడు అల్లరిగా కనిపించే హీరో నరేష్ నాంది సినిమాతో నరేష్ లో సీరియస్ యాంగిల్ కూడా ఉందని ప్రేక్షకులు తెలుసుకునేలా చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: