బిగ్ బాస్ - 5 : హామీద హగ్గులు.. శ్రీరామ్ ముద్దులు.. ఒకే దుప్పట్లో సిరి, షణ్ముక్..!!

Anilkumar
బిగ్ బాస్ రియాలిటీ షోలో గేమ్ తో పాటు లవ్ ట్రాక్స్  కూడా నడుస్తూనే ఉంటాయి. ప్రతీ సీజన్లో మనం ఈ లవ్ ట్రాక్స్  ను చూస్తూ వస్తున్నాం.ఇక లాస్ట్ సీజన్లో అఖిల్, మోనాల్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది.మధ్యలో కొన్ని వారాలు అభిజిత్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు.చివరికి అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది.అయితే ఈసారి సీజన్ 5 కి ఈ లవ్ ట్రాక్ ని యాప్ట్ చేస్తున్నారు శ్రీరామ్ చంద్ర, హామీద లు.శ్రీరామ్ చంద్ర కెప్టెన్ అయ్యాక..హామీదా రేషన్ మేనేజర్ అయ్యింది.వీరిద్దరూ జంటగా గేమ్ ఆడటం వల్ల శ్రీరామ్ ప్రామిస్ చేసినట్లుగానే హామీదను రేషన్ మేనేజర్ ని చేసాడు.ఆ సమయంలో హౌస్ మేట్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఒక్క వారమే కదా అని ఊరుకున్నారు.

ఇక గత వారం గిటార్ వాయించి మరీ హామీదను ఇంప్రెస్ చేసాడు శ్రీరామ్.ఇక అప్పటినుంచి ప్రతీ రాత్రి గుడ్ నైట్స్ చెప్పుకుంటూ ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చుకుంటున్నారు.ఇక హౌస్ లో ప్రస్తుతానికి రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ జరుగుతున్న నేపథ్యంలో జెస్సితో టాస్క్ ఆడిన శ్రీరామ్ కి దెబ్బలు తగిలాయి.ఇక వాటికి మందురాస్తు హామీద తన ప్రేమని చూపించింది.ఇక తెల్లవారుజామున అందరూ పడుకున్నప్పుడు హామీద, శ్రీరామ్ ఒకరినొకరు హాగ్ చేసుకున్నారు.అంతేకాక అక్కడే హౌస్ మేట్ దగ్గర్నుంచి కొన్ని నాణేలు కొట్టేసి మరి హామీదకు ఇచ్చాడు శ్రీరామ్.ఇక ఆ తర్వాత గట్టిగా హగ్ చేసుకున్న వీళ్ళు ఎవరి బెడ్ దగ్గరికి వాళ్ళు వెళ్లి ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చుకున్నారు.

ఇక ఈ లవ్ ట్రాక్ అనేది ఒక సైడ్ అయితే...మరో ట్రాక్ సిరి ఇంకా షణ్ముక్ ది. వీరిద్దరూ పక్క పక్క బెడ్స్ పైనే పడుకుంటున్నారు.అంతేకాదు టాస్క్ ఆడుతున్న రాత్రి జెస్సి వచ్చి  మాట్లాడుతున్నప్పుడు ఒకే దుప్పటిని ఇద్దరు కప్పుకున్నారు.ఇవన్నీ చూస్తుంటే ఈసారి సీజన్ హద్దులు దాటి వెళ్తోందా అని అనిపిస్తోంది.ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఈ షో లో ఇలాంటివి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాదు ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారా లేక ప్రేమాయణాలను నడపడానికి వచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: