సమంతకి అతనితో వున్న బంధం ఏంటి?

Purushottham Vinay
ఇక ప్రస్తుతం మీడియాలో ఇంకా అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య - సమంత ల విడాకుల విషయం గురించే ఎక్కువ వార్తలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి.ఇక వీరిద్దరూ కూడా ప్రేమ పెళ్లి చేసుకొని నాలుగేళ్ళు ఎంతో ప్రేమగా గడిపి చివరికి ఇలా విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక దీంతో చై-సామ్ ఇలాంటి ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకోడానికి గల బలమైన కారణాలు ఏంటా అని అందరూ కూడా తెగ ఆలోచిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే దీనికి సమంత హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఓ కారణమనే బలమైన రూమర్స్ వచ్చాయి.ఇక నాగ చైతన్య సమంత విడాకుల ప్రకటన తర్వాత ప్రీతమ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం వంటి వాటిపై కూడా నెటిజన్స్ అనేక సందేహాలు అనేవి వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలో వీరిద్దరి కాపురంలో కూడా నువ్వు చిచ్చుపెట్టావని ప్రీతమ్ జుకాల్కర్ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇంకా అక్కినేని అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


ఇక వీటిని చూసి ప్రీతమ్ ఆ టార్చెర్ కి తట్టుకోలేక సైబర్ క్రైమ్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెడుతున్నాడు. అయితే ఇక సమంత - ప్రీతమ్ బంధం పైన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ స్పందించడం జరిగింది.సమంత - ప్రీతమ్ కు మధ్యన ఉన్న వారి రిలేషన్ ను అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ''నిజానికి సమంతను ప్రీతమ్ ప్రేమగా 'జీజీ' (అక్కా) అని పిలుస్తాడు..ఇక జీజీ అంటే అర్థం తెలుసు కదా అని ఈమె చాలా ఘాటుగా సమాధానం ఇవ్వడం అనేది జరిగింది.ఇక ఆ దేవుడు తనకు తెలివిని ప్రసాదించాడని..ఇక దీన్ని కొంత మంది తెలివిలేని వాళ్లకు పంచుదామని  సాధనా సింగ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొనడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: