సింపుల్ గా అదరగొడుతున్న రాశిఖన్నా..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ రాశి ఖన్నా నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు రాశి ఖన్నా నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగునాట వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా. సుప్రీమ్, జై లవకుశ, జిల్, హైపర్, శివమ్, వరల్డ్ ఫేమస్ లవర్, వెంకీ మామ, తొలిప్రేమ వంటి పలు చిత్రాలలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రాశి కన్నా ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది.

అందులో భాగంగా ప్రస్తుతం రాశి కన్నా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో కూడా రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా కూడా రాశి కన్నా ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రాశి కన్నా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది. చేతికి వాచీ పెట్టుకున్న రాసి కన్నా అలా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్న ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అలా సింపుల్ గా డీసెంట్ గా  ఉన్న రాశి ఖన్నా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: