మన దేశానికి చెందిన ప్రముఖ నటులలో
హీరో సిద్దార్థ్ కూడా ఒకరనే విషయం అందరికి తెలిసిందే.
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బాయ్స్ సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దార్థ్ తొలి సినిమాతోనే మంచి విజయాన్నిఅందుకున్నారని తెలుస్తుంది..
తెలుగులో
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మరియు బొమ్మరిల్లు సినిమాలతో సిద్దార్థ్ ఖాతాలో విజయాలు చేరాయని తెలుస్తుంది.ఈ సినిమాలతో సిద్దార్థ్ కు తెలుగులో
లవర్ బాయ్ గా గుర్తింపు దక్కిందని సమాచారం.
అయితే ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన సిద్దార్థ్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా నటించలేదని సమాచారం. మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న సిద్దార్థ్ ఈ
సినిమా ఫలితంను బట్టి తెలుగులో కెరీర్ ను కొనసాగించాలో వద్దో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది.
అయితే తాజాగా సిద్దార్థ్
ట్విట్టర్ లో చేసిన ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.
సిద్దార్థ్ సమంతను ఉద్దేశించి ఆ పోస్ట్ చేశాడని చాలామంది భావిస్తున్నారట. అయితే ఆ తర్వాత కొంతమంది సిద్దార్థ్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారని తెలుస్తుంది. అయితే సిద్దార్థ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్న వాళ్లకు ధీటుగా కౌంటర్ ఇచ్చారని సమాచారం.
సామ్ కోసం గతంలో సిద్దార్థ్ పాడిన పాటను తెగ వైరల్ చేస్తున్నారని తెలుస్తుంది. సిద్దార్థ్
సమంత కోసం ఆ వీడియోలో అద్భుతంగా పాట పాడారని సమాచారం.
సిద్దార్థ్ ట్వీట్ లో ఏదైనా తప్పుగా అనిపించి ఉంటే ఆ వీడియో చూడాలని సిద్దార్థ్ ఫ్యాన్స్ పోస్ట్ లో పేర్కొన్నారని సమాచారం. ఓ చెలియా నా ప్రియ సఖియా పాట
తమిళ వెర్షన్ ను సిద్దార్థ్ పాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ వీడియోను చూసి సిద్దార్థ్ ను ట్రోల్ చేయాలంటూ అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారని సమాచారం.