సినిమా కి ప్రాణం పోసిన ఎమ్ ఎమ్ కీరవాణి!!

P.Nishanth Kumar
వైష్ణవ్ తేజ్ హీరో గా తెరకెక్కిన కొండ పొలం సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కొండ పొలం అనే నవల ఆధారంగా గా తెరకెక్కగా సినిమా కు నవల కు చాలా తేడాలు ఉన్న నేపథ్యం లో ఈ సినిమాలో నవల లక్ష్యాన్ని ను ఏ మాత్రం దెబ్బతీయకుండా సినిమా లిబర్టీ తీసుకుని మంచి సినిమా గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్.  అవసరమైన క్యారెక్టర్లను ఎంతో భావోద్వేగంగా రూపొందించారు.

ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కల్మషం లేని అక్కడి మనుషులను కూడా చూపించారు.  వర్షాలు లేక నీళ్లు లేక మూగజీవాలు పడే ఆవేదన కూడా ఎంతో స్పష్టంగా చూపించారు. అడవిని ప్రేమించే విధానాన్ని ఆకట్టుకునేలా చూపించి అడవి యొక్క ప్రాధాన్యతను కూడా వెల్లడించారు. గొర్రెలను దొంగిలించే ముఠా, అడవి నాశనం చేసే దుర్మార్గులు అలాగే అడవి పేరు చెప్పుకొని దోచుకునే కొంతమంది పెద్దలు అలాగే వారి అన్యాయాలను కూడా ఈ చిత్రంలో చూపించారు.  మొత్తానికి ఈ సినిమా దర్శకత్వ పరంగా నటీనటుల నటన పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

ఆ విధంగా ఈ సినిమా విజయం కోసం ప్రతి ఒక్కరు ఇష్టపడి పని చేయగా ఈ సినిమాకు ప్రాణం పోసింది కీరవాణి సంగీతం అనే చెప్పాలి.  సంగీత దర్శకుడు గా కీరవాణికి టాలీవుడ్ లో గొప్ప పేరుంది. బాహుబలి సినిమా కు అద్భుతమైన సంగీతాన్ని అందించి తెలుగు జాతికి వన్నె తెచ్చిన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. ఆయన సంగీతం తప్పకుండా ఈ సినిమాలో ప్రేక్షకులను అబ్బుర పరిచే సంగీతం ఉంటుందని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఈ సినిమాలోని పాటలు మరియు నేపధ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పవచ్చు. కొన్నికొన్ని సీన్స్ లో కీరవాణి తన అనుభవాన్నంతా రంగరించి ఈసినిమా కోసం పని చేశాడు అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: