సీరియల్ స్టార్ సిరికి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్...
ఇంతకీ విషయం ఏంటంటే... అక్కినేని వారసుడు నాగ చైతన్య తదుపరి చిత్రంలో సిస్టర్ క్యారెక్టర్ కి ఆ చిత్ర బృందం సిరిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమేనని టాక్ వినిపిస్తోంది. మరి పూర్తి వివరాలు ఇంకా తెలియ లేదు కానీ ఈ అమ్మడికి ఇంతలోనే ఇంత పెద్ద ఛాన్స్ వచ్చిందా అంటున్నారు విన్నవారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో వెలిగి పోవాలని ఎందరో అనుకుంటారు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. కానీ కొందరే ఇక్కడి సక్సెస్ ని అందుకుని ముందుకు సాగుతారు. మరి కొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉండగా ఇంకొందరు నిరాశతో వెనుతిరుగుతారు. ఇలాగే ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సిరి హన్మంతు.
ఈమె అసలు పేరు శిరీష హన్మంతు. కానీ అందరూ ముద్దుగా సిరి అంటుంటారు. హీరోయిన్ గా ఎదగాలన్నది సిరి ఆకాంక్ష అట. అయితే న్యూస్ రిపోర్టర్ గా కెరియర్ ని ప్రారంభించిన సిరి ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో, వెబ్ సిరీస్ లలో, కొన్ని సీరియల్స్ లో అవకాశాలు అందుకుని ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు రాజ్ తరుణ్ మూవీ "ఒరేయ్ బుజ్జిగాడు" చిత్రంలో కూడా మెరిసి మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో అల్లరి చేస్తోంది ఈ చిన్నది.