ఎన్టీఆర్ షోకు స‌మంత‌..ఎప్పుడు ప్ర‌సారం అవుతుందంటే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ బ్యూటీ సమంత విడాకుల తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. గతం గతః అనుకుంటూ మళ్లీ తన సినిమా కెరీర్ ను గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. విడాకుల నేప‌త్యంలో కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ ల‌కు దూరంగా వెళ్లిపోయిన స‌మంత హైదరాబాద్ నుండి కూడా మ‌కాం మార్చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తా విడాకుల తర్వాత సమంత నిన్న హైదరాబాద్ లో జరిగిన ఓ టీవీ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. న‌గ‌రంలోని ఓ జూనియర్ కాలేజీలో యాడ్ షూట్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొని ఆ స‌మయంలో స‌మంత భావోద్వేగానికి లోనైన‌ట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగానే సమంత ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు రాబోతున్నట్టు కూడా సమాచారం. 

ఎవరు మీలో కోటీశ్వరుడు లో స‌మంత‌కు సంబంధించిన ఎపిసోడ్ ను దసరా పండుగ సందర్భంగా ప్ర‌సారం చేస్తార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ వినిపిస్తోంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఓ స్పెషల్ ఎపిసోడ్ ను ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు టీం ప్లాన్ చేశారట. అయితే ఆ ఎపిసోడ్ కోసం ముందు ప‌లువురిని అనుకోతా చివ‌ర‌కు సమంత గెస్ట్ గా ఫిక్స్ అయిన‌ట్టు సమాచారం. అంతేకాకుండా ఈరోజు ఎన్టీఆర్ తో కలిసి అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్ లో స‌మంత‌ షూటింగ్లో పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో ఎవరు మీలో కోటీశ్వరుడు సంబంధించి షూటింగ్ జరుగుతోంది.

దాంతో సామ్ అక్క‌డకే వెళ్లింది. ఇక స‌మంత ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు నుండి  25లక్షల ప్రైజ్ మనీ కూడా గెలుచుకో పోతుందని సమాచారం. అయితే సమంత ఎవరు కోటీశ్వరుడు షోలో వ‌స్తున్న‌ట్టు ఇంకా ప్రోమో అయితే విడుద‌ల కాలేదు. ఇదిలా ఉండగా ఎవరు కోటీశ్వరుడు షో ఆగస్టు 22న ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర విషయాలు చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: