క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సరయు..?

Divya
బిగ్ బాస్ సీజన్ -5 లో జనానికి విన్నర్ అవుతూ ఉంది అనే కాన్ఫిడెంట్ లో ఉన్న కంటెస్టెంట్ లో సరయు కూడా ఒకరు. ఇక అంతే కాకుండా 7 ఆర్ట్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసింది సరయు. ఇక బిగ్బాస్ లో ఎలాంటి కంటెస్టెంట్స్ తో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో ఈమెకు ఏ మాత్ర మొహమాటం పడదు. అయితే బిగ్ బాస్ లో ఎలాగైనా విన్నర్ అవుతానని రంగంలోకి దిగిన సరయు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన ప్రేక్షకులను, తన అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.


బిగ్ బాస్-5 లో మొదటి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ రికార్డు సృష్టించింది. ఇక ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈమెకు ఉన్న ప్రస్తుతం క్రేజ్ కు బిగ్ బాస్ వల్ల వచ్చిన పాపులారిటీ తో సరయు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉంటోంది.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేసింది. ఇక ఇదే విధంగా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది సరయు. సినిమాలంటే చాలా పిచ్చి తోనే సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేశానని.. మొదటిలో చాలామంది తనని కమిట్మెంట్ అడిగే వారిని తెలియజేసింది.


వారు అలా అడగ్గానే ఆమె పరిస్థితిని గుర్తుచేసుకొని బోరున ఏడ్చేశానని తెలియజేసింది సరయు.ఇక వారి కళ్ళకు నేను అలా కనిపిస్తున్నానా అంటూ కుమిలిపోయే దాన్ని అంటూ.. ఏడవసాగింది. కానీ తన సొంతంగా 7 ఆర్ట్స్ అనే ఒక ఛానల్ ని పెట్టడం వల్ల చాలా ధైర్యం వచ్చిందని తెలియజేసింది. ఇక అంతే కాకుండా 7 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కట్నం కోసం గొడవ పడుతుంటే.. అతనితో వివాహం క్యాన్సిల్ చేసుకున్నాం అని సరయు కంటతడి పెట్టుకుంటే తెలియజేసింది. ఫ్యూచర్ లో మంచి అబ్బాయి వస్తే పెళ్లి చేసుకుంటానని తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: