డ్రగ్స్ వాడితే తప్పేంటి.. దివ్యభారతి, నేనూ డ్రగ్స్ తీసుకున్నాం!

Chakravarthi Kalyan
డ్రగ్స్ విషయం ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం.. ఆయన్ను జ్యూడిషియల్ కస్టడీకి పంపడంతో ఇష్యూ బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఇదే సమయంలో డ్రగ్స్ వాడకంపై పలువురు నటులు స్పందిస్తున్నారు. కొందరు విచిత్రంగా డ్రగ్స్ తీసుకుంటే తప్పేముందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి బాలీవుడ్‌లో డ్రగ్స్ అనే అంశం ఇప్పటిదేమీ కాదు.. దశాబ్దాల తరబడి ఈ అంశం ఉంది. అయితే ఎవరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరకలేదు.. ఇప్పుడు ఆర్యన్ దొరికిపోయాడు.


అందుకే ఇప్పుడు ఆర్యన్‌కు మద్దతుగానూ కొందరు బాలీవుడ్ నటులు గొంతెత్తుతున్నారు. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, పూజా భట్‌, హృతిక్‌ రోషన్‌ ఆర్యన్‌ను వెనకేసుకొస్తూ స్పందించారు. ఇక ఇప్పుడు మరో సీనియర్‌ నటి సోమీ అలీ ఆర్యన్‌కు సోషల్‌ మీడియాలో మద్దతు ఇచ్చింది. అసలు
ఆర్యన్‌ చేసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. పిల్లలు డ్రగ్స్‌ వాడడంలో పెద్ద తప్పేముంది.. నాకయితే ఇది పెద్ద విచిత్రంగా అనిపించట్లేదని కామెంట్ చేసింది.


అంతే కాదు.. ఈ సమాజంలో వ్యభిచారం, డ్రగ్స్‌ వంటి వాటిని పూర్తిగా తొలగించలేమంటోంది.  అంతే కాదు.. వ్యభిచారం, డ్రగ్స్‌ను నేరాల జాబితాలోంచి తొలగించాలంటోంది. ఇక్కడ ఎవరు సాధువులు కాదు. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్‌ తీసుకున్నాను అంటూ పాత విషయాలు చెప్పుకొచ్చింది. తాను ఆందోళన్‌ సినిమా తీస్తున్న సమయంలో దివ్యభారతితో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నానని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఇలా చెప్పడానికి ఎలాంటి గిల్ట్‌ ఫీలింగ్‌ లేదని సోమీ అలీ చెబుతోంది.


ఇక ఇలా నేరుగా ఆర్యన్‌ను సెలబ్రెటీలు సపోర్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇన్ని రూల్స్ ఉన్నా.. ఇప్పటికీ యువత డ్రగ్స్ కు అలవాటుపడుతోంది. ఇక ఈ మాత్రం పగ్గాలు కూడా వదిలేస్తే.. ఇంకెలా ఉంటుందో అన్న ఆందోళన సమాజంలో ఉంది. కానీ.. ఈ సెలబ్రెటీలకు మాత్రం ఇది ఏమాత్రం తప్పుగా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: