అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దర్శకత్వంలో ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే, ఈ సినిమా లో ఇప్పటికే కీలక సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా పోర్టు లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఏజెంట్ చిత్రబృందం మరికొన్ని కీలక సన్నివేశాల కోసం యూరప్ కు బయలుదేరానునట్లు తెలుస్తోంది. బుడాఫెస్ట్ లో ఈ నెల 20 నుంచి కీలక సన్నివేశాల్ని చీత్రీకరించే ఆలోచనలో ఏజెంట్ చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమా ఒక హనీట్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాను చాలా స్టైలిష్ గా తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ తాజాగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈనెల 15 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ వద్ద అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగినట్టుగానే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలకు జనాల నుండి మంచి స్పందన దక్కుతుంది. మరి ఈ సినిమా జనాలను ఎంత మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ చిత్రం విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.