టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్ సరసన 'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సి.మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. స్టార్ హీరోలు లేకుంగా తాప్సి లీడ్ రోల్ లో నటించిన సినిమాలో వంద కోట్ల క్లబ్ లో చేరినవి చాలానే ఉన్నాయి.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది ఈ బ్యూటీ.
ఇక తాజాగా దక్షిణాదిన 'జనగణమన', 'మిషన్ ఇంపాజిబుల్' వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ కథలు కావడం విశేషం.ఇక తాజాగా ఈమె నటించిన లేడీ ఓరియెంట్ చిత్రం 'రష్మీ రాకెట్'.ఈ నెల 15 దసరా కానుకగా ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 లో విడుదల కానుంది ఈ సినిమా.ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది తాప్సి.అందులో భాగంగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇండ్రస్టీ లో తనకు మొదట నుంచి కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు ఇస్తూ వచ్చారని..ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగిందని.
కానీ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయని పేర్కొంది.అయితే ఇలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు ఒప్పుకోరని తాప్సి కామెంట్స్ చేసింది.కానీ వాళ్ళ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని తెలిసినా నటిస్తామని..కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోరని..ముఖ్యంగా పెద్ద హీరోలు ఎవరూ కూడా తనతో నటించడానికి ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చింది.అంతేకాదు గతంలో తనతో నటించిన ఓ హీరో కూడా ఇటీవల నో చెప్పాడని నిర్మొహమాటంగానే చెప్పేసింది తాప్సి.ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.బాలీవుడ్ లోనే దాదాపు ఐదు సినిమాల్లో నటిస్తోంది తాప్సి...!!