బాలకృష్ణ టాక్ షో లో మొదటగా ముచ్చటించేది వారితో నేనట..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతో ఎంత గా ప్రేక్షకులను అలరిస్తాడో, బయట కూడా తన స్పీచ్ లతో జనాలను అంతే గానే అలరిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ  అఖండ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది , ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమాను దీపావళి నాటికి అన్ని పనులు పూర్తి చేసి నవంబర్ 4 వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ 'క్రాక్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించేందుకు రెడీగా ఉన్నాడు.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరొక సినిమాలో నటించేందుకు కూడా బాలకృష్ణ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టుకుంటూ వెళుతున్న బాలకృష్ణ  తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించ బోతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో కు మొదటి గెస్ట్ లుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ అభిమానులు ఈ టాక్ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా. ? ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: