శర్వానంద్ మరియు సిద్ధార్థ్ కథానాయకులుగా ఆర్ ఎక్స్100 సినిమా తో దర్శకుడు గా తనను తాను నిరూపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం. దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 15వ తేదీన విడుదల అవుతుంది. ఆ రోజున అక్కినేని అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా దానికి పోటీగా మహాసముద్రం సినిమాను విడుదల చేస్తుంది చిత్రబృందం. ఏదేమైనా దసరా సీజన్ కాబట్టి ఆ రోజున ఈ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్.
ఇకపోతే ఈ సినిమా పై ముందు నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని సినిమాలు గా శర్వానంద్ కు సక్సెస్ అనేది లేకపోవడం అలాగే ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు కథ ఓకే కావడంతో శర్వానంద్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఏదేమైనా శర్వానంద్ సినిమా విజయం సాధించడం ఖాయమని కూడా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం అప్పుడే పోటీ మొదలైనట్లుగా తెలుస్తుంది.
బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి ఈ సినిమాను రీమేక్ చేయాలని కొన్ని ఆఫర్లు వస్తున్నాయట. నిర్మాతలకు సినిమా విడుదల కాకముందే ఈ రేంజ్ లో రీమేక్ కోసం డిమాండ్ అంటే మామూలు విషయం కాదు. తెలుగు లో సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ తో అంచనాలను పెంచి అందరిలో ఆసక్తి ఈ సినిమా అప్పుడే రీమేక్ హక్కుల కోసం తయారయింది అంటే తెలుగులో కూడా ఈ సినిమా భారీగానే హిట్ అవుతుందని చెప్పవచ్చు శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. అను ఇమ్యన్యుయెల్ మరియు అతిధి రావు హైదరి హీరోయిన్ లు గా నటిస్తున్నారు.