ప్రకాశ్‌రాజ్ డబ్బులు పంచుతున్నాడా.. మంచు విష్ణు పంచుతున్నాడా..?
ప్రకాశ్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతుందని నరేశ్ విమర్శిస్తుంటే.. మీరు పంచుతూ మాపై ఆరోపణలు చేస్తారా అంటూ శ్రీకాంత్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని.. మనిషిని బట్టి 10నుంచి 25 వేలు రూపాయలను మూడు, నాలుగు సెంటర్స్ లో పంచుతున్నారని నరేశ్ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఆరోపించడం కలకలం రేపింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ మానిఫెస్టో రిలీజ్ చెయ్యకుండా డబ్బు గెలిపిస్తుంది అని.. మెంబర్లను ప్రలోభపెడుతున్నారని నరేశ్ విమర్శించారు.
మా సభ్యులు డబ్బులు తీసుకోండి.. ఓటు మి మనసాక్షి కి వెయ్యండి.. అని నరేశ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై శ్రీకాంత్ స్పందించారు. నరేష్ ఆరోపణలను శ్రీకాంత్ ఖండించారు. నరేష్ ఇంకా ఎందుకు అబద్ధాలు అడుతున్నారు.. మేము డబ్బులు పంచుతున్నమా?.. నరేష్ చేస్తున్న పనిని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడని శ్రీకాంత్ అంటున్నాడు. దసరా సమయంలో మేము తప్పుచేస్తే ఆ అమ్మవారే మమ్మల్ని శిక్షిస్తుందని శ్రీకాంత్ అంటున్నాడు.
ఇలాంటి సంస్కృతి లేని పనులు మేం చెయ్యం.. దయచేసి వీటిని నమ్మవద్దని మా సభ్యులను శ్రీకాంత్ కోరుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నీ నాశనం చెయ్యడానికే వున్నారా మీరందరూ... రిపొద్దున ఎలక్షన్స్ పెట్టుకొని డబ్బులు పంచుతున్నామని చెపుతారా.. డబ్బులు పెంచుతుంది మీరు... నీవల్లే అసోసియేషన్ డబ్బులు మొత్తం పోయాయి.. దయచేసి మెంబర్లు ఇలాంటి మాటలకు లొంగవద్దని శ్రీకాంత్ అంటున్నాడు... మరి వీరిలో ఎవరు డబ్బు పంచుతున్నారో.. ఎవరు పంచట్లేదో.. వారి మనస్సాక్షికే తెలియాలి. అయినా డబ్బులిచ్చినా ఓట్ల రాలతాయా..?