చైతన్య మెట్యూరిటీ కి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
దసరా రేస్ కు రాబోతున్న సినిమా రేస్ ల హడావిడి ప్రారంభం అయింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు మీడియా వర్గాలు అఖిల్ పూజా హెగ్డే ల గురించి కాకుండా ఎక్కువగా ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన  నాగచైతన్య వైపు దృష్టి పెట్టాయి.


సమంత తో విడిపోయిన తరువాత చైతన్య మొదటిగా హాజరైన పబ్లిక్ ఫంక్షన్ కావడంతో మీడియా దృష్టి అంతా చైతూ పై పడింది. చైతన్య తన జీవితంలో ఏమి జరగనట్లుగానే చాల చక్కగా నటిస్తూ మొఖంలో ఎటువంటి టెన్షన్ కనిపించకుండా అందరితో నవ్వుతూ మాట్లాడటం చూసినవారు చైతన్యలో మెట్యూరిటీ లెవెల్స్ బాగా పెరిపోయాయి అంటూ కామెంట్స్ చేసారు.


వేదిక పైకి వచ్చేడప్పుడు చాల మనోనిబ్భరంతో కనిపిస్తూ వేదిక పైకి వచ్చి చాల గంభీరంగా ఉండటమే కాకుండా చాల చక్కటి భాషతో ఉపన్యాసం ఇవ్వడం అతడి అభిమానులను ఆనంద పరిచింది. తన తాత అక్కినేని నుండి తమ ఫ్యామిలీని అభిమానిస్తున్న అభిమానుల కోసం జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదురైనా తాను తట్టుకుని నిలబడతాను అంటూ చెప్పిన చైతూ మాటలలో చాల క్లారిటీ కనిపించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


ఇదే సందర్భంలో అఖిల్ గురించి మాట్లాడుతూ ఈమూవీతో అఖిల్ దశ తిరుగుతుందని అభిప్రాయపడ్డాడు. లాఫింగ్ ధేరపీ లా ఈమూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటాడని ఈ సినిమా పై అంచనాలు పెంచాడు. ఇక ఈమూవీ హీరోయిన్ పూజ హెగ్డే కూడ ఈ మూవీ తరువాత  తమ ఇద్దరి కాంబినేషన్ గురించి అందరు తెగ మాట్లాడుకుంటారని అంటూ అఖిల్ లవ్ లీ పర్సన్ అంటూ ప్రశంసలు కురిపించింది. అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇచ్చినా వాటిని కాదనుకుని ధియేటర్లలో విడుదల అవుతున్న ఈమూవీ తరువాత అఖిల్ కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: