వైష్ణవ్ తేజ్ కామెంట్స్ కు షాక్ లో రకుల్ ప్రీత్ !

Seetha Sailaja
నిన్న విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు కష్టపడి ఉన్నత విద్యలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఈపోటీ ప్రపంచంలో కొనసాగుతున్న వర్ణ వివక్షత కారణంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలలో ఓడిపోయి తిరిగి గొర్రెల కాపరిగా మారిన ఒక సహజమైన కథ చుట్టూ ఈమూవీ తిరుగుతుంది.


ఈమూవీలో వైష్ణవ్ తేజ్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నప్పటికీ కమర్షియల్ గా ఈమూవీ ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్నసందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు ఉన్నాయి. ప్రతి సన్నివేశం చాల సహజంగా ఉండటంతో ఈమూవీ ఒక అవార్డు మూవీలా కనిపిస్తోందని సగటు ప్రేక్షకుడు కామెంట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వైష్ణవ్ తేజ్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు.


ఈ సినిమాలో తాను రకుల్ ప్రీత్ తో రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు తనకు చాల ఇబ్బంది కలిగింది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో రకుల్ తో రొమాన్స్ చేసే కంటే గొర్రెలు కాచుకోవడం తనకు చాల సులువు అనిపించింది అంటూ జోక్ చేసాడు. దీనికి కారణం రకుల్ చాల సీనియర్ హీరోయిన్ అనీ ఇప్పటికే ఆమె తమ కుటుంబంలోని అనేకమంది హీరోలతో నటించడంతో ఆమెతో రొమాన్స్ సీన్స్ లో నటించడానికి తాను భయపడ్డాను అంటూ జోక్ చేసాడు.


అయితే రకుల్ చాల ప్రోఫిషనల్ అంటూ ఆమె తనకు రొమాన్స్ సీన్స్ లో ఎలా నటించాలో దర్శకుడు క్రిష్ తో పాటు అనేక టిప్స్ ఇస్తున్నప్పటికీ తాను అనేకసార్లు ఫాలో కాలేక ఒకటికి రెండు సార్లు టేక్స్ తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు. అయితే ‘ఉప్పెన’ సినిమాలో తనకు కృతి శెట్టి తో ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదని దీనికి కారణం ఆమె కూడ కొత్త హీరోయిన్ కావడంతో తాను స్వేచ్చగా నటించాను అని అంటున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: