మా "పోరు": గెలుపుపై మోహన్ బాబు అంత నమ్మకముగా ఉన్నారా?

VAMSI
మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజ్ ల ప్యానెల్ లు పోటీ హోరా హోరీగా ఉంది. మా ఎన్నికల్లో పాల్గొనేందుకు తారలు కదలివస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో భాగమైన ప్రతి సభ్యుడు తన ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ వద్దకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా పోలింగ్ వద్దకు రావడం కనుల పండుగగా మారింది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్ జెనీలియా ఓటు హక్కును వినియోగించేందుకు జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి రావడంతో ఆమెను చూసిన వారంతా సంతోషంతో మునిగిపోయారు. హీరో విష్ణు ఆమెను సాదరంగా ఆహ్వానించి తీసుకొచ్చారు.

ఇక పోలింగ్ విషయానికొస్తే సినీ నటుడు మోహన్ బాబు హీరో స్టైల్ లోనే మాట్లాడుతూ అందరినీ తన మాటలతో ఆకట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయితే కానీ హిట్టా ఫట్టా అని క్లారిటీ రాదని ఆయన అన్నారు. ఇంకో గంటలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత నాలుగు గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం పోలింగ్ బూత్ వద్ద  వాతావరణం రామరావణ యుద్దాన్ని తలపిస్తోంది. ఎక్కువ మెజారిటీ విష్ణుకే దక్కుతుంది అన్న ఆశాబావాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈవెనింగ్ కౌంటింగ్ లో ఎవరి పేరు మారు మ్రోగనుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఓటేసిన అగ్ర  హీరోలు...నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. కానీ హీరో వెంకటేష్ మాత్రం ఇంకా పోలింగ్ వద్దకు చేరుకోలేదు.

నిన్నటి వరకు విమర్శలు..ప్రతి విమర్శలు జరిగిన మాటల యుద్ధం నేడు అంతగా కనపడలేదు. హెల్తీ కాంపిటీషన్ అంటూ నటులు సందడి చేస్తున్నారు. కానీ పోలింగ్ కేంద్రం వద్ద హీరోలను చూడటానికి ప్రేక్షకులు తరలి రావడం వలన కాస్త తోపులాట జరుగుతోంది. పోలీసులు చర్య తీసుకుంటున్నారు.  మరిబ్ ఇప్పటికే ముగిసిన పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ నాలుగు గంటలకు మొదలు కానుంది. విజేతగా ఎవరు గెలవనున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: