'మా' ఫలితాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..?
మా ఎన్నికల ఫలితాలపై కామెంట్ చేసిన చిరంజీవి.. చిన్న చిన్న పదవుల కోసం సినీ పరిశ్రమలో విద్వేషాలు పెంచుకోవద్దని సూచించారు. పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ కామెంట్స్
చేశారు. ఇదే వేదికపై రాఘవేంద్రరావు, వెంకటేశ్ ఉన్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు చిరంజీవి. అంతే కాదు.. వివాదాల సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని చిరంజీవి సూచించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని.. వివాదాలతో చులకన కావద్దని చిరంజీవి సూచించారు.
మా వంటి పదవులు తాత్కాలికమని చిరంజీవి అన్నారు. ఇవి రెండేళ్లో, మూడేళ్లో, నాలుగేళ్లో ఉంటాయని.. కానీ సినీ పరిశ్రమలలో మనం కలకాలం ఉండాలని చిరంజీవి అన్నారు. ఈ పదవులు తాత్కాలికమన్న చిరంజీవి.. మా సభ్యులంతా.. సినీ పరిశ్రమ అంతా వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాక్షించారు. అలా లేకుండా గొడవలు పడితే.. బయట వాళ్లకు ఎంత లోకువ అవుతాం అంటూ చిరంజీవి హితవు పలికారు. పదవుల కోసం ఒకరినొకరు కించపరచవద్దని చిరంజీవి సూచించారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్న వెంకటేశ్, తాను ఇతర నటులు ఇప్పటికీ ఎంతో స్నేహంగా ఉంటున్నామని వెంకటేశ్‌ను ఆలింగనం చేసుకుంటూ చెప్పారు చిరంజీవి. మరి ఈ మా ఎన్నికల ఫలితాల సమయంలో చిరంజీవి చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఇకైనా మా గొడవలు సద్దుమణుగుతాయని ఆశిద్దాం.