టాప్ ఛానల్ ఆఫర్ ను తిరస్కరించిన సమంత !
ఇలాంటి పరిస్థితులలో సమంత ఒక టాప్ ఛానల్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం డైవర్స్ తరువాత ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉంటున్న సమంత తో ఒక లైవ్ ఇంటర్వ్యూ చేయాలని ఒక ప్రముఖ ఛానల్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగించడమే కాకుండా ఆమెకు తమ ఛానల్ ప్రసారం చేయబోయే లైవ్ ఇంటర్వ్యూకి ఆమె అనుమతి ఇస్తే అత్యంత భారీ పారితోషికాన్ని ఆమెకు ఆఫర్ చేస్తామని ఒక మధ్యవర్తి ద్వారా తెలిపినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.
అయితే సమంత మాత్రం తాను కొన్ని నెలలపాటు మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటానని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాని అదేవిధంగా తన డైవర్స్ విషయాల గురించి కాని తాను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోలేదు అంటూ ఆ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఆఫర్ ను ఆమె తిరస్కరించినట్లు టాక్. దీనితో సమంత అజ్ఞాతవాసం మరికొంత కాలం కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి అయిన తరువాత ఈమూవీ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ సక్సస్ అయితే సమంతకు మరన్ని సినిమాలలో నటించే ఆస్కారం ఉంది. అయితే ఈ విడాకుల వ్యవహారం సమంత కెరియర్ పై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోకొంత ఉంటుందని రానున్న రోజులలో ఆమెకు భారీ సినిమాలలో అవకాశాలు రాకపోవచ్చు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..