మా క్యాంటిన్ వైపు జీవిత అడుగులు ?
ఆమె మంచు విష్ణు ప్యానల్ తో కానీ లేదంటే కనీసం ఇండిపెండెంట్ గా ఈ ఎన్నికల పోటీలో నిలిచి ఉంటే కరోనా పరిస్థితులలో ఆమె ‘మా’ సంస్థ సభ్యులకు చేసిన సేవకు సరైన గుర్తింపు వచ్చేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా జీవిత తన ఎన్నికల ప్రచారంలో తాను ఎన్నికలలో గెలిచినా ఓడినా ‘మా’ క్యాంటిన్ పెడతాను అంటూ చేసిన వాగ్దానం ఆమె నెరవేర్చగలుగుతుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి.
రాజశేఖర్ ట్రస్ట్ ద్వారా సహకారం తీసుకుని 24 క్రాఫ్ట్స్ కోసం 'మా' క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తామని అమ్మా క్యాంటిన్ అన్న క్యాంటిన్ మాదిరిగా మా క్యాంటిన్ ఉంటుందని జీవిత రాజశేఖర్ అనేకసార్లు తెలిపారు. దీనితో ఈమె ఆలోచనలలో వచ్చిన ‘అమ్మా’ క్యాంటిన్ పరిస్థితి ఏమిటి అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
వాస్తవానికి జీవితా రాజశేఖర్ ఆశయం మంచిది అయినప్పటికీ ఆమె ఆలోచన వాస్తవ రూపంలోకి రావాలి అంటే ఆర్థికంగా శారీరకంగా ఆమె చాల కష్టపడాలి. ప్రస్తుతం రాజశేఖర్ దంపతులు తమ కెరియర్ పరంగా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలలో ఓడిపోయిన జీవిత తన ఆశయాన్ని నెరవేర్చడం చాల కష్టమైన పని. ప్రస్తుతం ఆమె తన కుమార్తెలను హీరోయిన్స్ గా సెటిల్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా అతడికి సరైన అవకాశాలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో జీవిత ‘మా’ ఎన్నికలలో ఓడిపోవడం ఆమెకు ఒక షాక్..