జయసుధ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం ఆ హీరోనేనా..??
అయితే ఒక్కనొక్క సమయంలో దర్శక ధీరుడు రాఘవేంద్రరావు 'జ్యోతి' అనే ఒక చిన్న సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాలో హీరోగా మురళీ మోహన్‌ను సెలక్ట్ చేశారు. అయితే హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరు అనేది ఫైనల్ చేయలేదు. ఈ మూవీ కోసం కేరళ, మద్రాసుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు వచ్చి వెళ్తున్నారు. ఇక చివరికి ఎవరు కూడా రాఘవేంద్రరావుకు నచ్చలేదంట. ఈ తరుణంలో ప్రొడ్యూసర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా సినిమా ఎక్కడ ఆగిపోతుందోననే టెన్షన్ మురళీ మోహన్‌లో ఆందోళన మొదలైంది.
ఇక అప్పుడు మురళీ మోహన్ 'లక్ష్మణ రేఖ' అనే చిత్రంలో నటిస్తున్నానని, అందులో నటిస్తున్న జయసుధని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటే , చాలా బాగుంటుందని డైరెక్టర్ రాఘవేంద్రరావుకు మురళీ మోహన్ చెప్పరంట. అయితే అప్పుడు రాఘవేంద్ర రావు.. ఎవరు ఆ అమ్మాయి.. బాగుంటుందా..? బాగా నటించగలదా..? అని పలు ప్రశ్నలు ఆయనని అడిగి వివరాలు తెలుసున్నారంట. దాని మురళి మోహన్ బాగా నటిస్తోందని చెప్పారు.
అంతేకాదు.. సదరు అమ్మాయి ఆల్బమ్ తెప్పించు చూద్దాం అని రాఘవేంద్రరావు అన్నారంట. అంతేకాక.. మురళీ మెహన్ ఆ రోజు సాయంత్రమే జయసుధ ఆల్బమ్ తెప్పించి చుపించారంట. ఇక ఆల్బమ్ చూసి హీరోయిన్‌గా జయసుధను డైరెక్టర్ ఓకే చేశారంట. అయితే అలా 'జ్యోతి' సినిమాకు హీరోయిన్ ఫైనల్ చేయడంలో హీరో మురళీ మోహన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మురళీమోహన్ కారణంగానే జయసుధ మంచి హీరోయిన్ గా గుర్తింపుని తీసుకొచ్చింది.