సాంబ సినిమా ప్లాప్ కి కారణం అదేనా..??

N.ANJI
యాంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ్సరం లేదు. ఎన్టీఆర్ బొమ్మ సినిమాలో ప‌డిందంటే చాలు 100 రోజులు ఆడుతుంది అనడంలో ఎలాంటివో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఎంత సెల‌బ్రిటీకైనా కొన్ని సార్లు ఫ్లాపులు త‌ప్ప‌వు.. సినిమా మొత్తం మంచిగానే ఉన్నపటికీ ప‌లు భిన్న కార‌ణాల వ‌ల్ల కొన్ని సార్లు అగ్ర హీరోల సినిమాలు కూడా ఫ్లాప్‌లు అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు యావ‌రేజ్‌గా రాణిస్తుంటాయి.
ఎన్టీఆర్ యాక్షన్ సినిమాలో నటిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సాంబ సినిమా గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ సినిమా కథ మొత్తం మంచిగా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకునంతగా గుర్తింపుని తీసుకరాలేకపోయింది. ఇక ఎన్టీఆర్‌, వినాయ‌క్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సాంబ హిట్ కాలేదు కానీ అబోవ్ యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకుంది.
ఇండస్ట్రీలో ఎన్‌టీఆర్ ఫామ్‌లో రాణిస్తున్నారు. ఇక వినాయ‌క్ కూడా ఠాగూర్ తీసి అప్ప‌ట్లో జోష్‌ మరింత పెంచారు. అయితే హీరోయిన్స్ కూడా సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే. అయ్యినప్పటికీ సాంబ మూవీ హిట్ అందుకోలేకపోయింది. ఇక అబోవ్ యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా యాక్షన్ పరంగా ఆదరణ పొందలేకపోయింది. అంతేకాదు.. కొన్ని డైలాగ్స్ పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఎన్‌టీఆర్‌కు చెందిన గ‌త సినిమాల క‌న్నా సాంబ మూవీలో హింస మ‌రీ ఎక్కువైంద‌ని అప్ప‌ట్లో వార్తలో వినపడింది. అంతేకాదు.. వ‌దిన‌ల‌పైనే అత్యాచారం చేయ‌బోయిన మ‌రుదుల‌ను అందుకు స‌పోర్ట్ చేసిన అన్న‌ల‌ను అందులో చూపించడం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. ఇక దాంతో ఈ సినిమా అబోవ్ యావ‌రేజ్ గా నిలిచిందనే చెప్పాలి. అంతేకాక.. ఈ సినిమాలో సీన్ల‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకునేదని ప్రేక్షకులు భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: