యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలలో మొదటగా రాదే శ్యామ్ సినిమా థియేటర్ లో సందడి చేయబోతుంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా తో పాటు ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాతో పాటు కే జీ ఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు గా మంచి పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమా షూటింగ్ లను చక చక పూర్తి చేసుకుంటున్నాడు.
మరియు ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లాంచింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఇలా ఇప్పటికే నాలుగు పాన్ ఇండియా సినిమాలు వరస లో పెట్టిన ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో స్పిరిట్ అనే పాన్ వరల్డ్ సినిమాను కూడా ఈ మధ్యనే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొదట సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కథను మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు వినిపించినట్లుగా ఆ కథను వారు తిరస్కరించినట్లు గా వార్తలు వస్తున్నాయి. అయితే అదే కథను సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ కు వినిపించినట్లు ఓకే చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.