అస్సలు తగ్గేదే లే అంటున్న నాగబాబు..!

murali krishna
" data-original-embed="" >
మా సభ్యత్వానికి నటుడు మరియు మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. రాజీనామా పత్రాన్ని ఆయన ట్విట్టర్‎లో పోస్ట్ చేశారని తెలుస్తుంది.ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి నాగబాబు ప్రకాష్ రాజ్‎కు సపోర్ట్ చేస్తూ వచ్చారని అందరికి తెలుసు..

అతడు జాతీయస్థాయి నటుడు అంటూ అలాగే కింది నుంచి పైకి వచ్చాడు అంటూ ప్రకాష్ రాజ్‎పై ప్రశంసలు కురిపించారట నాగబాబు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారని తెలుస్తుంది. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారని సమాచారం. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారని తెలుస్తుంది..

ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేదని "మా" అసోసియేషన్లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు. - నాగబాబు' అంటూ నాగబాబు రాసుకొచ్చారని సమాచారం. అలాగే నేడు సాయంత్రం 7 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తానని ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ తనని అడగాలని కోరారట నాగబాబు. మరి అభిమానులు మరియు ప్రేక్షకుల అడిగే ప్రశ్నలకు నాగబాబు ఎలాంటి సమాధానాలు చెప్తారో వేచి చూడాలి మరి.


ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాను తెలుగువాడిని కాదని అలాగే అతిథిగా వచ్చానని అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారని సమాచారం. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చేసానని అలా అని తెలుగు సినిమాలో నటించకూడదని ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి యథావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారని సమాచారం. తనను నాన్ లోకల్ అన్నారని అలాగే అతిథిగానే ఉంటే గౌరవిస్తామన్నారని చెప్పుకొచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: