'జై బాలయ్య' కె ఓటేస్తున్నారా ....??

GVK Writings
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలోని బాలయ్య రెండు లుక్స్ కి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. అలానే అడిగా అడిగా అనే పల్లవితో సాగె సాంగ్ కూడా ఇటీవల బయటికొచ్చి శ్రోతల్ని ఆకట్టుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు చెప్తున్నారు. అయితే త్వరలో దీని తరువాత గోపీచంద్ మలినేని తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు బాలయ్య. ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించనుండగా థమన్ స్వరాలు సమకూర్చనున్నారు. అయితే ఈ సినిమాని భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న గోపీచంద్, ఇప్పటికే స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని జై బాలయ్య గా నిర్ణయించి రెండు రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేసిందట మూవీ యూనిట్. అయితే బాలయ్య పేరు వచ్చే విధంగా ఈ టైటిల్ పెట్టడానికి కారణం, సినిమాలో ఆయన పేరు కూడా బాలయ్య కావడమేనని సమాచారం. ఇక త్వరలో ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించి టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట. మరి ఇదే కనుక నిజం అయితే బాలయ్య పేరు మీద తన నెక్స్ట్ సినిమా రానుండడం ఆయన అభిమానులకి మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: