ఇకపై తెలుగు మూవీస్ కి ప్రకాష్ రాజ్ దూరం .... ??
ఇక నిన్న ఎన్నికల్లో ఓటమి పాలవడంతో నేడు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి కొంత ఆవేదన వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్, తాను తెలుగు వాడిని కాకపోవడం వల్లనే తనని ఓడించారని, అందువల్ల ఆ విషయం తనని ఎంతో బాధిస్తోందని, కావున తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. అలానే నూతన అధ్యక్షుడు విష్ణు తన రాజీనామా ని ఆమోదించాలని ఆయన కోరారు. సభ్యత్వానికి రాజీనామా చేసిన తనకు ఎల్లపుడూ ఇక్కడి తెలుగు ప్రజల ప్రేమాభిమానాలతో పాటు ఇక్కడి నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్, దర్శకులు ఇలా అందరితో ఉండే అనుబంధం ఇప్పటికే ఇలానే ఉంటుందని అన్నారు.
అయితే పలు టాలీవుడ్ వర్గాలలో నేడు ఉదయం నుండి ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాల అనంతరం ప్రకాష్ రాజ్ ఇకపై తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించినట్లు టాక్. అయితే అది ఎవరి మీద ద్వేషంతో తీసుకున్న నిర్ణయం కాదని, స్వయంగా తాను అలోచించి తీసుకున్న నిర్ణయం అని ప్రకాష్ రాజ్ చెప్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారికంగా ప్రకాష్ రాజ్ నుండి ప్రకటన రావాల్సి ఉంది.