కలకలం సృష్టిస్తున్న నాగబాబు రాజీనామా లేఖ.. ఏం రాశారంటే..?

Chakravarthi Kalyan
మా ఎన్నికలు ముగిసినా సినీ ఆర్టిస్టుల్లో విబేధాలు తొలగిపోలేదు.. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అంతా కలసికట్టుగా సినీ కార్మికుల సమస్యలపై పోరాడతామంటూ గతంలో మాట్లాడిన మాటలు నీటి మూటలే అవుతున్నాయి. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేని నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అదే రోజు రాత్రి ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను 48 గంటల్లో మా ఆఫీసుకు పంపుతానన్నారు. ఆయన చెప్పినట్టుగానే తన రాజీనామా లేఖను పంపినట్టు తెలుస్తోంది.


మా అసోసియేషన్లో  పెరిగిన ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వం  కారణంగానే తాను మా నుంచి తప్పుకుంటున్నట్టు నాగబాబు ప్రకటించారు. ప్రాంతీయ, సంకుచితత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేదన్నారు. తాజాగా త‌న రాజీనామా లేఖ‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అందులో ఏమన్నారంటే.. నిష్పక్షపాత, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును తాను ఎప్పుడూ అభిమానించేవాడనని గుర్తు చేసుకున్నారు.


విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచిందని నాగబాబు పాతరోజులను  గుర్తు చేసుకున్నారు.  అయితే.. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ...ఇటు మనుషులుగా  చాలా ఊహించని  మార్పులు వచ్చాయంటున్నారు నాగబాబు.. ఇలాంటి  అసహ్యకరమైన మార్పులు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని నాగబాబు తన లేఖలో వివరించారు.


తాజాగా జరిగిన మాఈ ఎన్నికలు తనకు కనువిప్పు కలిగించాయని... బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని  నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగలాని నిర్ణయం తీసుకున్నట్టు  లేఖలో తెలిపారు. ప్రకాశ్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మాలో ఇటీవలి పరిణామాల పట్ల తాను బాధపడటం లేదన్న నాగబాబు.. మా భవిష్యత్‌పైనే తాను ఆందోళన చెందుతున్నానన్నారు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: