'బిగ్ బాస్ - 5' లో 25 నిమిషాలకే హైపర్ ఆది షాకింగ్ రెమ్యునరేషన్..?

Anilkumar
బుల్లితెరపై ఆదివారం ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 5 మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పాలి. ఈ సీజన్ స్టార్ట్ అయిన మొదటి రరెండు వారాలు టీఆర్పీ బాగానే వచ్చినా.. ఆ తర్వాత డౌన్ అయ్యింది. ఇక దసరా నవరాత్రి స్పెషల్ అంటూ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ నే పంచారు.ఇక ఈ స్పెషల్ వీకండ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కూడా భాగం అయ్యాడు.ఇక ఆదివారం ఎపిసోడ్ కి హైపర్ ఆది రావడంతో షో కి ఒక్కసారిగా రేటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది.కొంత మంది సెలబ్రిటీలు డాన్సులతో,పాటలతో ఆకట్టుకున్నప్పటికీ హైపర్ ఆది స్కిట్ మాత్రం బాగానే పేలింది.


ఇక అతనికి స్టార్ మా యాజమాన్యం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.హైపర్ ఆది కేవలం 25 నిమిషాల పాటు షోలో తనదైన పంచులతో అందరినీ బాగా నవ్వించాడు.ఇందుకు భారీ రెమ్యునరేషనే అందుకున్నాడట ఆది. సాధారణంగా జబర్దస్త్ లో వారానికి మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసినందుకు గానూ లక్షన్నర నుండు రెండు లక్షల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటాడట ఆది.ఇక బగ్ బాస్ లో మొదటి సారి అవకాశం అందుకున్న ఇతను..ముందు నుంచే షోను ఫాలో అవుతూ వస్తున్నాడు.స్టార్ మా షో మొదలైనప్పుడే ఆదికి అడ్వాన్స్ ఇచ్చి షోకి ఫాలో అవ్వమని చెప్పారట.


ఇక షోలో అరగంట పాటు కనిపించాల్సి ఉంటుందని కమిట్మెంట్ తీసుకొని 2.50 లక్షలకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.అలాగే భవిష్యత్ లో కూడా హైపర్ ఆది బిగ్ బాస్ షోలో సందడి చేసే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు.ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ లోపలికి రావాలని పిలవగా..దానికి ఇంకా టైమ్ ఉందని హైపర్ ఆది సమాధానం ఇచ్చారు.ఇక హౌస్ లో అందరిపై పంచులు పేల్చి,కడుపుబ్బా నవ్వించిన హైపర్ ఆది టాలెంట్ కి మన కింగ్ నాగార్జున సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు.ఇక ఇదే ఎపిసోడ్ లో చాలా మంది సెలబ్రిటీలు సందడి చేసి నా కానీ.. హైపర్ ఆది స్కిట్ మీదకి అవి నిలవలేకపోయాయనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: