పవన్ కళ్యాణ్ సినిమాకు హ్యాండిచ్చిన పూజ హెగ్డే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు, ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో తిరిగి  ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇలా వకీల్ సాబ్ సినిమా మంచి విజయం సాధించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలో నటిస్తున్నాడు,  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను చక చక పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.


మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కూడా ప్రారంభం కాబోతున్నట్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొన్ని రోజుల క్రితం తెలియజేశాడు. దీనితో పాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్  అనే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రారంభించబోతున్నారు అని కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే డేట్ లు కుదరకపోవడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: