వర్మ సినిమా చరిత్ర సృష్టిస్తుంది : కొండా సురేఖ
అప్పట్లో రక్త చరిత్ర అనే సినిమాను తెరకెక్కించి వర్మ ఎంతో సంచలనం సృష్టించాడ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కీలక నేతగా కొనసాగుతున్న కొండా దంపతులు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు.. ఇక ఇటీవల చిత్రం షూటింగ్ వరంగల్ లో ప్రారంభమైంది. గండిమైసమ్మ ఆలయంలో పూజలు చేసి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే ఇందులో పాల్గొన్న కొండా సురేఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హాట్ కామెంట్స్ చేసారు. నేను చదువుకునే రోజుల్లో ఉదయం ఏడు గంటలకు తనకోసం కొండా మురళి చక్కర్లు కొట్టే వాడు అంటూ గుర్తు చేసుకున్నారు.
మమ్మల్ని ఎంతగానో అణగదొక్కేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నించారు. కానీ ఆయన కంటే ముందే మేము మంత్రి పదవిని సొంతం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు మమల్ని టిడిపిలోకి ఆహ్వానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నన్ని రోజులు పార్టీలోకి రాలేము అంటూ తేల్చి చెప్పాము. టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళిన తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి ఒక తల్లికి పుట్టిన నేను టీడీపీ ని విడిచి పెట్టను అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ లోకి వచ్చాడు దీన్ని బట్టి ఎర్రబెల్లి ఎంత మందికి పుట్టాడో ఆయనకి తెలియాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి కొండా సురేఖ. తమ జీవితం పై రామ్ గోపాల్ వర్మ సినిమా ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. కొండ సినిమాలో రాజకీయం తోపాటు ప్రేమకథ కూడా ఉంటుంది. సినిమా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు.