మహా సముద్రం సినిమా సమంత వదిలేయడానికి గల కారణం..?
ఇక ట్రైలర్ కూడా సరికొత్త గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా rx100 డైరెక్టర్ అజయ్ భూపతి సినిమాని తెరకెక్కించడం జరిగింది.అందులో ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమా విడుదలైన మొదటి రోజు చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆతృతతో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.
ఈ సినిమాలు మహాసముద్రం అనే పదం హీరోయిన్ పేరు ని ఇండికేట్ చేస్తూ ఉంటుందని. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.ఇక మహా సముద్రం సినిమాలో మహా పాత్ర ఎ హీరోయిన్ ని చూపించారో మాత్రం తెలియజేయలేదు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇక తాజాగా ఈ సినిమాలో మహా పాత్ర కి ముందుగా స్టార్ హీరోయిన్ సమంతని సంప్రదించారట.
ఈ సినిమా కథను నాగచైతన్య సమంతకు డైరెక్టర్ ఈ కథను చెప్పగా..చైతు చేస్తే ఈ సినిమాలో నేను కచ్చితంగా నటిస్తానని అని చెప్పుకొచ్చింది సమంత. కానీ కొన్ని కారణాల చేత నాగ చైతన్య ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ అయ్యాడు. ఇక ఇదివరకే సమంత జాను సినిమాలో నటించింది. వీరి నటనకు మంచి మార్కులే వచ్చాయి కానీ సినిమా మాత్రం ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది. ఇక అందుచేతనే ఈ సినిమాలో సమంత తప్పుకున్నట్లు సమాచారం.