ఎన్నో వాగ్దానాలు..గొడవలు వార్నింగ్ ల అనంతరం మా ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు జరిగిన తీరు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కొరకడాలు..తిట్లు దాడులు ఇలా ఎన్నెన్నో జరిగిపోయాయి. ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు జరిగిన తరవాత గెలిచిన ఎవరైనా మరొకరిపై విమర్శలు చేసే అవకాశం ఉందని ముందే అర్థమైపోయింది కూడా. ఇక ఇప్పుడు ఊహించినట్టుగానే మా ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ పానల్ మంచు విష్ణు పానల్ సభ్యులు పోలింగ్ సమయంలో దౌర్జన్యానికి పాల్పడ్డారని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ పానల్ నుండి గెలిచిన ఎనిమిది మంది సభ్యులు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు. ఇక ప్రకాష్ రాజ్ మరియు నాగబాబు ఏకంగా మా సభ్యత్వాలకే రాజీనామా చేస్తామని ప్రకటించారు.
ఇక తమ రాజీనామాలకు కారణం మా లో ఇదివరకూ రెండు పానల్ ల సభ్యులు సగం సగం గెలిచారని అయితే రెండు పానల్ లకు చెందిన సభ్యులు ఉంటే అభివృద్ధి జరగదని అరోపించారు. అంతే కాకుండా తాము ముందే చెప్పామని..ఎవరినైనా ఒకే పానల్ కు చెందిన వారిని గెలిపించాలని కోరామని కానీ ఈ సారి కూడా అలాగే జరిగిందని చెప్పారు. ఇక రాజీనామా చేసిన వారిలో ఒకరు తమను బూతులు తిట్టారని...మరొకరు తమపై దాడికి యత్నించారని ఇంకొకరు గతంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేస్తూ రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తాము రాజీనామా చేసినప్పటికీ మా సభ్యులకు అండగా ఉంటామని ఓటు వేసిన వారి కోసం ప్రశ్నిస్తామని చెప్పారు.
పదవిలో ఉంటే తమ వల్లే అభివృద్ధి జరగలేదని చెబుతారని ఆరోపించారు. అయితే ఓట్లు వేసి గెలిపించిన వాళ్లు మాత్రం తమకు నచ్చిన అభ్యర్థులనే గెలిపించారు. రాజీనామా చేసి ప్రశ్నించే అంత బలం ఉండక పోవచ్చు. ప్రెస్ మీట్ పెట్టి అంత మాట్లాడిన వాళ్లు మా లో పదవుల్లో కొనసాగుతూ కూడా ధైర్యంగా ప్రశ్నించి పనులు చేయొచ్చు. తమను నమ్మి ఓటు వేసిన వారికి అలాగే మా కు న్యాయం చేయ వచ్చు. ఇక మూకుమ్మడి రాజీనామాకు కారణం ఓ వ్యక్తి చెప్పడమే అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక మా గొడవులు చూస్తుంటే తమను నమ్ముకున్న సభ్యులను పట్టించుకోకుండా తమ పదవుల కోసం మాత్రమే కష్టపడ్డారేమో అన్న విధంగా ఉంది.