శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ఆర్ ఎక్స్100 సినిమా తో మంచి విజయం అందుకున్న అజయ్ భూపతి దర్శకుడు గా తెరకెక్కిన సినిమా మహాసముద్రం, ఈ సినిమా మా నుండి విడుదలైన ప్రచార చిత్రాల కు, టీజర్, ట్రైలర్, పాటలకు జనాల నుండి మంచి స్పందన రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. ఇలా ఇప్పటికే జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా దసరా సందర్భంగా ఈ రోజు అనగా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ఇది ఇలా ఉంటే మొదట మహా సముద్రం సినిమా శర్వానంద్ హీరోగా మాత్రమే ప్రచారం లో ఉంది, కాక పోతే కాలం గడుస్తున్న కొద్దీ, సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ, ఈ సినిమా ను మల్టీస్టారర్ సినిమాగా చిత్ర బృందం ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ వచ్చారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల జోరు భారీగా నడుస్తోంది అని చెప్పవచ్చు. మల్టీస్టారర్ సినిమాలు చూడడానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తెలుగు ప్రజలు ప్రస్తుతం ఎంతో ఆసక్తి చూపిస్తున్న మల్టీస్టారర్ జోనర్ లో ఈ సినిమా వస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ లు చేయగా, ఈ సినిమా పై జనాలు కూడా ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. మరి జనాల పెట్టుకున్న అంచనాలను మహా సముద్రం సినిమా ఏ మేరకు చేరుకుంటుందో, తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని, తెలుగు ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ ను చూడబోతుంది అని చిత్ర బృందం గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు.