మా ఎన్నికల తర్వాత అందరం ఒకే కుటుంబంలా కలిసి ఉంటామని, ఒకే త్రాటిపైకి నడుస్తామని సినీ పెద్దలు ఇటీవల అన్న మాటలు నీటి మూటలే అయ్యాయని చెప్పాలి.మా లో ఎన్ని లుకలుకలు ఉన్నాయో ఒక్కొక్కటిగా మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి.'మా' ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ఆట మొదలైంది.అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన అందరూ తమ తమ పదవులకు రాజీనామాలు చేయడం..అటు అధ్యక్షుడిగా మంచు విష్ణు తన ఆట మొదలు పెట్టేసారు.ఈ నేపథ్యంలో 'మా' మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ.."ఇన్నేళ్లలో నేను ఎవరికీ భయపడలేదు.
ఎందుకంటే తప్పు చేసిన తప్పుడు నా కొడుకులు భయపడతారు..నేను తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడను.నేను కూడా అందరూ బాగుండాలనే కోరుకుంటాను.శివాజీ రాజా అనేవాడు ఇప్పుడే కాదు..ఎప్పుడూ భయపడడు.కొన్ని దెబ్బలు తిన్నాక నేను ఈ మాట చెప్తున్నా..నన్ను భయపెట్టే మగాడు ఇండ్రస్ట్రీ లో ఎవడు లేడు.నేను షూటింగ్ కి వెళ్లను..నాకు క్యారెక్టర్ వస్తే చేస్తా.. లేకుంటే లేదు.క్యారెక్టర్ ఇవ్వమని నేను ఒకడి దగ్గరికి వెళ్లను.ఈ మాట ఎందుకు అంటున్నానంటే..ఈ మాట ఒకడికి గట్టిగా తగలాలని..వీడు నా గురించే అన్నాడని వాడికి తెలియాలి.నేను వాడికి డైరెక్ట్ గానే చెప్పాను..నీలాంటి బొగడా గాళ్లని చాలా మందిని చూసా.
బ్యాగ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావ్ రా అని వాడికి చెప్పాను.నా దగ్గర పావలా లేనప్పుడు కూడా నేను ఎవడి దగ్గర చేయి చాచలేదు..భయపడలేదు.. అలాంటిది ఈ బొగడా గాడికి నేను భయపడతనా?వాడేమంత గొప్పోడు కాదు.కానీ నేను వాడ్ని తిట్టానంటే నన్నే తిట్టడాని వాడు అనుకుంటాడు.అందుకే చెప్తున్నా..ఇలాంటి వాళ్ళని బోలెడు మందిని చూసా.ఇండ్రస్ట్రీ లో చాలామంది వెదవలు పక్కపక్కనే ఉంటారు.మనం ఓడిపోతే పక్కకు వెళ్లి డాన్సులు చేసే వెదవలు కూడా ఉంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శివాజీ రాజా.అయితే ఈ మాటలు శివాజీ రాజా ఎవరిని ఉద్దేశించి అన్నాడని ఇండ్రస్ట్రీ లో ఎవరికి వారు ఎవరెవరినోఊహించుకుంటున్నారు...!!