బిగ్ బాస్ - 5 : కొత్త కెప్టెన్ అతనేనా..?

Anilkumar
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ గేమ్ షో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ సీజన్లో జరిగే గొడవలు, టాస్క్ లు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరవ వారం టాస్క్ హోరా హోరీగా సాగింది.అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం బొమ్మల తయారీలో లోపాలని సంచాలకులు కరెక్ట్ గా పరిశీలించగలిగారా..?వారి వారి టీమ్ మేట్స్ ఆడిన ఆటని వాళ్ళు కరెక్ట్ గా గమనించారా లేదా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే ఇవాల్టి బిగ్ బాస్ ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన నియమాలని అతిక్రమించారు అని బిగ్ బాస్ చెప్పగానే టాస్క్ సంచాలక్ లు ఇద్దరు భహాయపడతట్టు  చూపించారు.

ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే టాస్క్ లో భాగంగా  గ్రీన్ టీమ్ లో ఉన్న లోబో ఇంకా శ్వేత చేసిన దానికి బిగ్ బాస్ అలా చెప్పినట్టు తెలుస్తోంది.కాబట్టే బిగ్ బాస్ అలా చెప్పినట్టు ఉన్నాడు.అయితే శ్వేత ఇంకా లోబో టాస్క్ లో బిగ్ బాస్ పంపిన కాటన్ కాకుండా హౌస్ లోని పిల్లోలో ఉన్న కాటన్ ను  తీసుకుని వచ్చి బొమల్లో   నింపారు.ఈ విషయాన్ని సంచాలకులు మాత్రం చూడలేదు.బహుశా అందుకే బిగ్ బాస్ గ్రీన్ టీమ్ ని అనర్హులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఈ విషయాన్ని ఏమాత్రం గుర్తించలేని సంచాలకులని కెప్టెన్సీ పోటీదారుల నుంచీ తొలగించినట్లుగా తెలుస్తోంది.

అందుకే రెడ్ టీమ్ లో ఉన్న  శ్రీరామ్ చంద్ర, విశ్వ, ప్రియా అలాగే బ్లూటీమ్ నుంచీ మానస్, సన్నీ, అనీమాస్టర్లను ఈ టాస్క్ వినర్స్ గా అనౌన్స్ చేస్తారని టాక్.చివరికి వీళ్లలో కెప్టెన్సీ పోటీదారులుగా ఎంతమంది ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.మళ్ళీ వీరికి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తాడో చూడాలి.అయితే బిగ్ బాస్ ఫాలో అయ్యే  ప్రేక్షకులు మాత్రం ఈ వారం కెప్టెన్ మాత్రం విశ్వ అనే అంటున్నారు.ప్రేక్షకులు చెప్తున్నదాన్ని బట్టి చూస్తే ఈ వారం కూడా విశ్వ నే కెప్టెన్ ఐతే రెండోసారి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినట్లుగా అవుతుంది.అయితే నామినేషన్ విషయానికి వస్తే విశ్వ ఈవారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. కెప్టెన్ అయితే సేవ్ అవుతాడా లేదా అన్నది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: