ఆహా లో బాలయ్య షో ఐడియా ఎవరిదంటే?

P.Nishanth Kumar
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తెలుగు ఏకైక ఓటీ టీ సంస్థ ఆహా నిలబడాలంటే వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో రావాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలు ఎన్నో పుట్టుకు రావాలి. అలా అయితేనే ఈ పోటీ ప్రపంచంలో ఆహా సంస్థ నిలబడ గలుగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల తో కలసి ఎన్నో షో లు చేస్తూ ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ముందుకు దూసుకుపోతుంది ఆహా. అయినా కూడా ఏదో  కొరత కనిపిస్తుంది వారికి. ఇతర మాధ్యమాలు వినూత్నమైన ప్రోగ్రామ్స్ వినూత్నమైన సినిమాలు చేసుకుంటూ పోతుంటే తాము మాత్రం వెనుక పడి పోవడం ఏంటి అని అనుకున్నారో ఏమో ఈసారి ఓ పెద్ద హీరోతో టాక్ షో చేయాలని భావించారు.

ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు టాక్ షో చేస్తే బాగుంటుంది ప్రయత్నాలు చేయగా చివరకు బాలకృష్ణతో ఈ షో చేయడానికి సిద్ధమయ్యారు.  ఆ మధ్య ఈ షో గురించి కొన్ని పుకార్లు వచ్చినా కూడా మెగా వారి సంస్థలో బాలకృష్ణ చేయడం ఏంటి అది సాధ్యపడదు అనే విధంగా రకరకాల కామెంట్లు వచ్చాయి. కానీ వాటన్నిటిని పటా పంచలు చేస్తూ బాల కృష్ణ ఈ షో చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇది ఎంతగానో అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే అయినా ఈ రకమైన స్నేహభావం నెలకొల్పిన బాలకృష్ణకు మెగా అభిమానులు సైతం హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

అయితే మెగా నందమూరి కుటుంబాలకు పడదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన ఆలోచన తీసుకువచ్చి దాన్ని ఆచరణ వరకు తెచ్చి సక్సెస్ చేయడం లో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది. అసలు ఐడియా వచ్చింది ఎవరికీ అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ ఐడియా వచ్చింది అల్లు అరవింద్ కేనట.  ఓ రోజు ఈ షో గురించి చర్చించుకుంటున్నారు.  హోస్ట్ గా ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేయగా అల్లు అరవింద్ నందమూరి బాలకృష్ణ అయితే ఎలా ఉంటుంది అనగానే టీం సభ్యుల నుంచి కేకలు వినిపించాయట. అలా తనకు ఆలోచన రాగానే టీమ్ అంతా ఒప్పుకోగానే వెంటనే బాలకృష్ణ కి ఫోన్ చేసి విషయం చెప్పాడట.  బాలకృష్ణ కూడా ఓకే చెప్పడంతో ఈ షో ఇంత దూరం వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: