హైద‌రాబాద్‌లో సినిమాల‌కు క్రేజ్ త‌గ్గుతోందా.. నమ్మాల్సిన నిజాలు ఇవే..!

VUYYURU SUBHASH
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎలాంటి పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల నుంచి ప‌ల్లెటూర్ల వ‌ర‌కు మామూలు సంద‌డి ఉండ‌దు. అయితే ఈ సంద‌డి కంటే కూడా సినిమా రాజ‌ధాని హైద‌రాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే సంద‌డే వేరు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే సినిమా అభిమానులకు కేరాఫ్ అడ్రస్ అంటారు. ఇది మూడు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతూ వ‌స్తోంది. అక్క‌డ సినిమా రిలీజ్ అయితే తొలి రోజు తొలి షో నుంచి మామూలు పండ‌గ ఉండ‌దు. అయితే ఇప్పుడు మ‌ల్టీ ఫ్లెక్స్ లు రావ‌డం మొద‌ల‌య్యాక వీటి పోటీని క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేట‌ర్లు త‌ట్టు కోలేక‌పోతున్నాయి.

హైద‌రాబాద్‌లో ఎంత పెద్ద మ‌ల్టీ ఫ్లెక్స్‌లు, ఎన్ని పెద్ద థియేట‌ర్లు ఉన్నా కూడా సినిమా హీరోల నుంచి సెల‌బ్రిటీ ల వ‌ర‌కు అంద‌రూ కూడా క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేట‌ర్ల‌లోనే సినిమాలు చూసేందుకు ఇష్ట‌ప‌డే వారు. అయితే ఇప్పుడు అక్క‌డ థియేట‌ర్ల ప్రాభావం త‌గ్గుతోంది. న‌గ‌రంలో పుట్ట గొడుగుల్లా పుట్టుకు వ‌చ్చిన‌ మల్టీ ఫ్లెక్స్ ల కారణంగా రాను రాను సింగిల్ స్క్రీన్ లకు ఆదరణ తగ్గుతోందంటున్నారు.

అందుకే ఇప్పుడు హైద‌రా బాద్ సినీ ప్రేక్ష‌కుల నుంచి సెల‌బ్రిటీలు అంద‌రూ కూడా మెలమెల్లగా క్రాస్ రోడ్స నుంచి మల్టీ ఫ్లెక్స్ ల బాట పడుతున్నట్లు అక్క‌డ ప‌రిస్థితి చెపుతోంది. చివ‌ర‌కు తొలి రోజు ఎంత పెద్ద సినిమా అయినా కూడా క్రాస్ రోడ్స్ లో ఫుల్ కావ‌డం లేద‌ట‌. అదే అక్క‌డే రెండో థియేట‌ర్ కు కూడా ఇస్తే చాలా చాలా త‌క్కువ ఆక్యుపెన్సీ వుంటోంద‌ని చెపుతున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు క్రాస్ రోడ్స్ థియేట‌ర్ల‌లో సినిమాల‌కు ఉండే క్రేజ్ వేరు. అయితే ఇప్పుడు అది త‌గ్గుతోంద‌న్న‌ది సుస్పష్టం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: