వివాదంలో చిక్కుకున్న పెళ్లిసంద‌D హీరోయిన్ శ్రీ లీల‌...!

VUYYURU SUBHASH
ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష ణ‌లో ఆయ‌న శిష్యురాలు గౌరి ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా పెళ్లి సంద‌D సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అప్పుడెప్పుడో ఇదే రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ హీరోగా పెళ్లిసంద‌డి సినిమా వ‌చ్చింది. ఇప్పుడు అదే టైటిల్ తో పెళ్లిసంద‌D సినిమాను మ‌రోసారి రూపొందించారు. ట్విస్ట్ ఏంటంటే నాడు శ్రీకాంత్ ఆ సినిమాలో హీరో.. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో కాగా.. రాఘ‌వేంద్ర రావు శిష్యురాలు గౌరి రోనంకి ద‌ర్శ‌కు రాలు.

ఇక ద‌స‌రా కానుక‌గా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి న ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి సంద‌D హీరోయిన్ శ్రీ లీల వివాదంలో చిక్కుకున్నారు. శ్రీ లీల స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌. అయితే ఆమె త‌న కూతురు కాదంటూ ప్ర‌ముఖ వ్యాపార వేత్త సూప‌రనేని శుభాక‌ర రావు చెపుతున్నారు. పెళ్లి సంద‌D హీరోయిన్ శ్రీ లీల కు త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని శుభాక‌ర్ రావు తేల్చి చెపుతున్నారు.

శ్రీ లీల త‌న మాజీ భార్య కుమార్తె అని.. తాము విడిపోయిన త‌ర్వాత శ్రీల‌ల‌కు త‌న మాజీ భార్య జ‌న్మ‌నిచ్చింద‌ని ఆయ‌న చెపుతున్నారు. నా ఆస్తులపై క్లైమ్ చేయడానికి నా పేరు వాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక ఈ విష‌యంలోకి అన‌వ‌స‌రంగా త‌న పేరు లాగ‌డంపై మండి ప‌డుతోన్న ఆయ‌న ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతాము అని చెప్పారు.

ఇక శ్రీ లీల అలా హీరోయిన్ అయ్యిందో లేదో ఆమె కాంట్ర‌వ‌ర్సీ లో చిక్కుకోవ‌డంతో ఇండ‌స్ట్రీ లో ఇప్పుడు ఆమె పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం నుంచి శ్రీ లీల ఎలా భ‌య ట ప‌డుతుందో ?  చూడాలి. ఇక ఆమెకు ఇప్పుడు ప‌లు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: