బాలీవుడ్
బాద్షా షారుక్ ఖాన్ తనయుడు
ఆర్యన్ ఖాన్
డ్రగ్స్ కేసు లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ముంబైలో సముద్రం మధ్యన క్రూయిజ్ నౌక లో పలువురు ప్రముఖులతో పాటు
ఆర్యన్ ఖాన్
డ్రగ్స్ తీసుకుంటూ
రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం అయింది
ఆర్యన్ అనేక సార్లు బెయిల్ కోసం విన్నవించుకున్నా చిక్కులే ఎదురయ్యాయి. ఇక
ఆర్యన్ ఖాన్ అరెస్టు అయ్యిన నాటి నుండి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇతర రాజకీయ అంశాలను తప్పుదోవ పట్టించేందుకే
ఆర్యన్ ఖాన్ ను
అరెస్ట్ చేసి హైలెట్ చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశాన్ని ప్రముఖ దర్శకుడు
రామ్ గోపాల్ వర్మ కూడా తన సోషల్
మీడియా ద్వారా వెల్లడించారు. అధికారులు
ఆర్యన్ ఖాన్ కేసును హైలెట్ చేస్తున్నారని..
మీడియా కూడా హైలెట్ చేస్తోందని రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు.
అయితే ఈ కేసుపై
బాలీవుడ్ నటీ నటులు కొంత మంది షారుఖ్ వైపు ఉండగా మరికొందరు మాత్రం షారుక్ ఖాన్ పై విమర్శలు కురిపించారు.
బాలీవుడ్ నటి
కంగనా రనౌత్ కూడా
ఆర్యన్ ఖాన్ అరెస్టు కరెక్టే అని చెబుతూ షారుక్ ఖాన్ పై విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే
డ్రగ్స్ కేసులో
ఆర్యన్ ఖాన్
అరెస్ట్ అవ్వడం షారుక్ ఖాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. షారుక్ ఖాన్ షూటింగ్ లు వాయిదా వేసుకోవడం తో పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ ప్రముఖ లాయర్లకు సంప్రదించడం తో పాటు ఒక రాత్రంతా జైలు ముందే గడిపారని కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్సీబీ విచారణలో ఆసక్తికర విషయాలను చెప్పినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసు లో జైలు నుండి విడుదలై బయటకు వెళ్లిన అనంతరం తాను చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని
ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తానని
ఆర్యన్ చెప్పినట్టు సమాచారం. ఇకపై
డ్రగ్స్ జోలికి వెళ్లనని... అవసరమైన పేదవారికి తాను అండగా ఉంటానని
ఆర్యన్ ఖాన్ స్పష్టం చేసినట్టు ఎన్సిబి అధికారులు చెబుతున్నారు.