విక్టరీ
వెంకటేష్,
వరుణ్ తేజ్ హీరోలుగా
తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా
అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కి
2019 సంక్రాంతికి విడుదలైన
సినిమా ఎఫ్ టు, ఈ
సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే, భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను వెండితెరపై
అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానానికి, ఈ సినిమాలో పండించిన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ
సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్రాంచైజీ గా మరొక
సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఎఫ్ త్రీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా డా
వెంకటేష్,
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా
తమన్నా మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఈ
సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను మరియు ఇతర అప్డేట్ ను ఎఫ్ త్రీ చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. దేశంలో
కరోనా పరిస్థితుల వల్ల ఈ
సినిమా కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ చక చక జరిగిపోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర లపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ
సినిమా చిత్రబృందం లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని
వరుణ్ తేజ్ తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తూ లొకేషన్ లో
వెంకటేష్ తో దిగిన ఒక ఫోటోని షేర్ చేశాడు. ఈ షెడ్యూల్ అంతా కూడా పిచ్చ కామెడీతో సాగిపోతూ వస్తుంది, ఆ నాన్ స్టాప్
కామెడీ తట్టుకోవడం నా వల్ల కాలేదు, మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయ్యే అంత వరకు నేను ఆగలేను. అంటూ
వరుణ్ తేజ్ తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
వరుణ్ తేజ్ మాటలతో ఎఫ్ త్రీ మరో షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని
వరుణ్ తేజ్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.